calender_icon.png 25 September, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

25-09-2025 12:07:10 AM

నిర్మల్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో అమాయక మహిళలను యువతులకు ఆశగా ఎరచూపి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యుల గుట్టును రట్టు చేశారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వివరాలు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలోని ఓ కాలనీలో వ్యభిచా రం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్పీ రాకేష్ మీనా పట్టణ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో దాడి చేయగా ముగ్గురు పట్టుబడ్డట్టు తెలిపారు మరో ముగ్గురు పరారైనట్లు వివరించారు.

నఫియా బేగం ముఠాకు ప్రధాన సూత్రధారుని బిర్కాస్ చాంద్ మమ్మద్ ఇర్ఫాన్ ను రెడ్ అండ్‌గా పట్టుకోవడం జరిగింది అన్నా రు. ముఠా సభ్యురా లు అందర్నీ బెదిరించి ఈ వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఆమెపై విచారణ జరిపి కేసు నమోదు చేయ డం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజేష్ మీనా పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ ఉన్నారు

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు 

నిర్మల్ జిల్లా కేంద్రంగా మహారాష్ట్రకు చెంది న షేక్ రఫీ అలియాస్ షేక్ రఫీ రహీం అనే మోస్ట్ వార్డెడ్ క్రిమినల్ బుధవారం పట్టుకుని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఇతను కొద్దిరోజులుగా నిర్మల్ జిల్లాలో వివిధ రేషన్ దుకాణా ల నుంచి బియ్యాన్ని సేకరించి ధర్మాబాద్ కు తరలించి అక్కడ బియ్యాన్ని మరపెట్టి రైస్ మిల్లులకు విక్రయిస్తారని తెలిపారు. అక్రమ రేషన్ బియ్యం సరఫరాలు ఈయన అనేకసార్లు కేసులు నమోదయాయని గతంలో నిర్మల్ పట్టణం చెందిన రేషన్ బియ్యం సరఫరాదారులను కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురిచేసారని పేర్కొన్నారు.

ఈయనపై వివిధ ప్రాంతాల్లో కేసులు ఉన్నాయని అరెస్టు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని అయితే ఈ రెండు పోలీసులు పట్టుకొని ఆయన వాహనాలను వాహనాన్ని చేసినట్లు జరిగిందన్నారు. క్రిమినల్ల పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఎవరికి ఇబ్బంది కలిగిన పోలీస్ శాఖలు సంప్రదించాలని ఆమె సూచించారు ఈ రెండు కేసులను సేదించిన పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు