25-09-2025 12:43:15 AM
అలంపూర్ సెప్టెంబర్ 24 అలంపూర్ లో వెలసిన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవారికి హైదరాబాద్ కు చెందిన మహేష్ కుమార్ రెడ్డి, రాధికా రెడ్డి దంపతులు రూ. లక్ష విరాళాన్ని అందించారు.ఈ మేరకు బుధవారం ఆలయ ఈవో దీప్తిని కలిసి అట్టి చెక్కును అందజేశారు. అంతకుముందు భక్తుడు ఉభయ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి శాలువతో సత్కరించారు.