04-10-2025 07:24:05 PM
రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చి గౌరవించాలి..
తెలంగాణ యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి కోరే రవి యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందర్ రాజ్ యాదవ్ విన్నపం
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో బోళ్ళ రాజాలు యాదవ్ అధ్యక్షతన ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్థం చందర్ రాజ్ యాదవ్ కోరే రవి యాదవ్ లు మాట్లాడుతూ గోవిందరావుపేటతో పాటు ములుగు జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన గొల్ల కురుమలు స్తానికి సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుపడం రాజకీయ పార్టీలు తమ కులానికి ప్రాధాన్యతనిస్తూ టికెట్ల కేటాయింపు చేసినట్లయితే పోటీచేసి గెలుపును సాధించి మీ పార్టీకి పేరుతెచ్చి పెట్టడమే కాకుండా మీ పార్టీకి అండగా ఉంటారని రవి యాదవ్ తెలిపారు. కావున రాజకీయ పార్టీలపెద్దలు గొల్ల కురుమలకు జిల్లా మొత్తంలో టికెట్ల కేటాయించి గౌరవించాలని విన్నపం చేస్తున్నాం లేని పక్షంలో ఇండిపెండెంట్ గా కూడా పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రవి యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జి ఎలెందర్ యాదవ్ జల్లెళ్ళ కొమురయ్య యాదవ్ .మేడుదుల వెంకన్న యాదవ్ ఎల్లావుల రాజశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.