calender_icon.png 11 October, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెట్టును తలపిస్తున్న విద్యుత్ పోల్లు

10-10-2025 12:21:30 AM

భీమిని, అక్టోబర్ 9 : మండల కేంద్రంలోని భీమిని కాలనీలకు వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాలకు పిచ్చి మొక్కలు అల్లుకొని విద్యుత్ స్తంభాలు చెట్టును తలపిస్తున్నాయి. దీనితో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతుంది. వాహనదారులు చిత్తడిని గమనించకుంటే స్తంభాన్ని ఢీకొట్టి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండగా, మరోవైపు స్తంభం చుట్టూర పిచ్చి మొక్కలు అల్లుకొని ఉండటంతో పశువులు మేత తినడానికి వెళ్లి ప్రమాదం భారిన పడే అవకాశం ఉందని పశు ప్రేమికులు వాపోతున్నారు.

ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి విద్యుత్ స్తంభాలను చుట్టు ముట్టిన పిచ్చి మొక్కలను, అల్లుకున్న తీగలను తొలగించాలని కోరుతున్నారు. పిచ్చి తీగలను తొలగిం చడం వల్ల నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు అందుతుందని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.