21-09-2025 01:09:28 AM
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేష న్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ ‘డ్యూడ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. మైత్రిమూవీమేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. ‘ప్రేమలు’ తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రిలీజైన ఫస్ట్ సింగిల్ బూమ్‌బూమ్ చార్ట్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మేకర్స్ సెకండ్ గేర్ ‘బాగుండు పో..’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను సాయి అభ్యాంకర్ కంపోజ్ చేశారు. సంజిత్, సాయి అభ్యాంకర్ ఆలపిచారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్, లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్. భరత్ విక్రమన్ ఎడిటర్. ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.