01-12-2025 12:17:45 AM
అలంపూర్, నవంబర్ 30: గద్వాల జిల్లాలోని రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రాజోలి మేజర్ గ్రామపంచాయతీ స్థానానికి సర్పంచ్ అభ్యర్థిగా గోపాల్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ.. ఇంతకుముందు సర్పంచ్ గా గ్రామానికి సేవలు అందించిన అనుభవంతోనే మరోసారి సర్పంచ్ బరిలో పోటీలో నిలుస్తున్నట్లు తెలిపారు.
గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే మరోసారి గ్రామానికి సేవ చేసే అవకాశం కలుగుతుందన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మాజీ జెడ్పిటిసి శ్రీనివాసులు, నాయకులు అజయ్, చంద్రశేఖర్ గౌడు ఉన్నారు. అయితే నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.