calender_icon.png 1 December, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధలతో యువకుడి ఆత్మహత్య

01-12-2025 12:17:06 AM

ఉప్పల్, నవంబర్ ౩౦ (విజయక్రాంతి): ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ పోలీ స్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో నివాసముంటున్న  పాలడుగు సాయి(24) వృత్తిరీత్యా  డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లో  బెట్టింగ్లు నిర్వహించాడు. బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగా  అప్పుల పాలయ్యాడు.

అప్పులు ఎలా తీర్చాలో తెలియ క  మనస్థాపం చెంది  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అపరమారక స్థితిలో ఉన్న సాయిని చూసిన తండ్రి చంద్రయ్య   గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు న్న సాయి ఆదివారం పొద్దున్న తొమ్మిదిన్నర గంటల ప్రాంతం లో  మృతి చెందినట్లు గాంధీ వైద్యులు నిర్ధారించారు. తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.