calender_icon.png 18 November, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు సేవాభావంతో పనిచేయాలి

18-11-2025 12:00:00 AM

ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి 

చేవెళ, నవంబర్ 17(విజయక్రాంతి): వైద్య వృత్తి నేటి కాలంలో ఎంతో గొప్పగా అనిపించినా  విద్యార్థులు సేవాభావం తో పని చేయాలనీ ప్రభుత్వ చీఫ్ వీఫ్, పీ ఏం ఆర్ మెడికల్ కాలేజ్ చైర్మన్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్ వైద్య కళాశాలలో సోమవారం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం (2026-2026 ) విద్యార్థులకు వైట్ కోట్ సెరిమని క్యాడవరిక్ ఓత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ ముఖ్య అతిథిగా  తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త  ఆలోచనలతో వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవటం కోసం తపించాలని సూచించారు.

ఎన్నో జన్మనెత్తితే తప్ప మానవ జన్మ రాదని ఇలాంటి పరిస్థితుల్లో మానవాళికి మంచి చేయాలనే దృక్పథం, ఆలోచన ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ జోయారాణీ, మెడికల్ సూపరన్ టెండెంట్ రామకృష్ణారెడ్డి,  అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ గౌరీ, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు, జీఎం నగేష్, ఎంజీఎం రవివర్మ, సీఓఓ అజీమ్ తదితరులు ఆయనతో ఉన్నారు.