calender_icon.png 24 October, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి ‘పాలన పథకం’

22-10-2025 12:00:00 AM

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాం తి): ఆదిలాబాద్‌లోని బలరక్షక్ భవన్లో మం గళవారం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాలన పథకంపై ఐసీడీఎస్ సిబ్బందికి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీడ్ రాజారామ్ ప్రసాద్, ప్రోగ్రామ్ అధికారి మాణికప్ప, ప్రధాన శిక్షణదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలన పథకం లక్ష్యాలు, అమలు విధానం, డేటా సేకరణ పద్ధతులు, మొబైల్ అప్లికేషన్ వినియోగం తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

అనంతరం రిక్షా కాలనీ, సంజయ్ నగర్, మహాలక్ష్మి వాడలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, కేంద్రాల పని తీరును రాష్ట్ర లీడ్ రాజారామ్ ప్రసాద్ పరిశీలించారు.  ‘పాలన పథకం’అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సమగ్రంగా పనిచేస్తే, గ్రామ స్థాయిలో సానుకూల మార్పులు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి మిల్క, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్, సీడీపీఓలు సౌందర్య, శారద, ఉమాదేవి, నర్సమ్మ, వినూత్న, డీఎంసీ యశోద, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.