24-10-2025 06:06:59 PM
నిర్మల్ రూరల్: ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి ఈ నెల 27వ తేదీన అయోధ్య, కాశీ యాత్ర టీజీ ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీసులు నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. పెట్టిన సంగతి తెలిసిందే, యాత్రకు భక్తుల నుండి స్పందన ఎక్కువగా ఉండడంతో నవంబర్ 6వ తేదీన మరొక బస్సు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ వివరించారు. ఈ బస్సు 6వ తేదీ నాడు మధ్యాహ్ననం 1 గం!! కు నిర్మల్ నుండి బయలుదేరి తెల్లవారు 9 గం!! లకు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం కు చేరుకుంటుంది.
అక్కడ పవిత్ర స్నానం ఆచరించి మధ్యాహ్ననం 2 గం!! లకు కాశీ చేరుకుంటుంది. అక్కడ కాశి విశ్వనాధ్, విశాలాక్షి, అన్న పూర్ణ మాత, గంగాహారతి తీసుకొని ఆ రోజు రాత్రి కాశీ లోనే నైట్ హల్ట్ తెల్లవారి అయోధ్యకు చేరుకొని బాల రాముని దర్శించుకొని 9వ తేదీ రాత్రి నిర్మల్ చేరుకొనును ఒకరికి 6400/- రూ!! లు ఉంటుందని మన నిర్మల్ బస్టాండ్ లో గాని tgsrtcbus.in సైట్ లో లాగిన్ అయి మీ ఫోన్ లో కూడా బుక్ చేసుకోండి అని డిపోమేనేజర్ తెలిపారు.