calender_icon.png 3 January, 2026 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

02-01-2026 12:00:00 AM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్

మహబూబాబాద్, జనవరి1 (విజయక్రాంతి): రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. కలెక్టరేట్ చాంబర్ లో రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవం నిర్వహించ నున్నట్లు చెప్పారు.

ప్రజలకు రోడ్డు భద్రత పై అవగాహన పెంపొందించే విధంగా రూపొందించిన కరపత్రాలను, బ్యానర్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా విడుదల చేశారు. వివిధ వ ర్గాల ప్రజలకు, యువతకు, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. రోడ్డు భద్రత అంశాలపై వివిధ శాఖల ఆధ్వర్యంలో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.

అలాగే డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించడం, స్కూల్ బస్సుల భద్రతను పరీక్షించడం, విద్యార్ధులచే వ్యాసరచన క్విజ్ పోటీలు, వేగ నియంత్రణ మీద తనిఖీలు బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 31న ఉత్తమ అధికారులను, వాలంటీర్లను, పాఠశాలలకు, డ్రైవర్లకు అవార్డులు పంపిణీ నెలవారి నివేదికలను జరిగిన కార్య క్రమాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో జైపాల్ రెడ్డి, మో టార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సాయిచరణ్, డిపిఆర్‌ఓ రాజేంద్రప్రసాద్, పాల్గొన్నారు.