3 July, 2026 | 2:17 AM

ప్రజా సంక్షేమంలో ప్రభుత్వం విఫలం

03-07-2026 12:17 AM

హరీశ్‌రావు, ఆర్‌ఎస్‌పీ అరెస్టును ఖండించిన బీఆర్‌ఎస్ నేతలు

గజ్వేల్, జులై 2: ప్రజా సంక్షేమం, ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ భవన్లో చర్చలకు పిలిచి మాజీ మంత్రి హరీశ్రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్కుమార్లను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, భారీగా అప్పులు చేసినా అభివృద్ధి కనిపించడం లేదని ఆరోపించారు.

బీసీ సంక్షేమ నిధులపై స్పష్టత లేదని, రైతుబంధు బకాయిలు, రైతు బీమా అమలులో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి నర్సింగరావు, బీఆర్‌ఎస్ నాయకులు మాదాసు శ్రీనివాస్, బెండ మధు, నవాజ్ మీరా, ఉడెం కృష్ణారెడ్డి, ఆకుల దేవేందర్, హైదర్ పటేల్, స్వామిచారి తదితరులు పాల్గొన్నారు.