20-09-2025 12:00:00 AM
ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
కాగజ్‌నగర్, సెప్టెంబర్ 19 (విజయక్రాం తి): మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలం అవుతుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. మున్సిపాలిటీ ఎదురుగా సమస్యలు పరిష్కరించాలని చేపడుతున్న సమ్మెను శుక్రవారం ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వంతో మాట్లాడి రెండు రోజులలో వేతనాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
వేతనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. తమ సమస్య పరి ష్కారం అయ్యేంతవరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని కార్మికులు తెలిపారు. కార్మికులకు సీనియర్ సిటిజన్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మార్త సత్యనారాయణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయకులు సంజీవ్, కార్మికులు పాల్గొన్నారు.