20-09-2025 12:00:00 AM
ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో లాయర్ల నిరసన
ఎల్బీనగర్, సెప్టెంబర్ 19 : న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలని రంగారెడ్డి జిల్లా కోర్టులో లాయర్ల నిరసన నిర్వహించారు. మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్వకేట్లపై జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో లాయర్లు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ బార్ అసోసియేషన్ల అధ్యక్షుడు కొండల్ రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రంలో అడ్వకెట్లపై జరుగుతున్న దాడుల నేపధ్యంలో ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 498 కేసులో నిందితుల తరపున హనుమాన్ నాయక్, అనిల్ కుమార్ న్యాయవాదులు మంచాల పోలీస్ స్టేషన్ కి వెళ్లిన క్రమంలో భార్య బంధువులు పోలీస్ స్టేషన్ ఆవరణలో దాడి చేశారు.
వారిద్దరూ నాంపల్లి క్రిమినల్ కోర్టులో జీవిత సభ్యులు. లాయర్లపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కోర్టుల లాయర్లు పాల్గొన్నారు.