calender_icon.png 24 July, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తంగా ఉండాలి

23-07-2025 10:12:22 PM

- లింగంపేట వద్ద దుందుబి ప్రవాహాన్ని పరిశీలించిన ఎస్పీ డి.జానకీ 

- జడ్చర్లలో ట్రాఫిక్ జామ్ నివారణకు పలు సూచనలు

రాజపూర్: మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జడ్చర్ల మండల పరిధిలోని లింగంపేట గ్రామం వద్ద దుందుభి వాగు వద్ద పరిస్థితిని జిల్లా ఎస్పీ డి. జానకి(District SP Janaki) స్వయంగా పరిశీలించారు. ప్రజలు పొలాలకు వెళ్లే సమయంలో, అవసరాల నిమిత్తం వాగులు దాటే సందర్భాలలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. “నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవసరం లేకపోతే వాగులు దాటి వెళ్లకూడదు. పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలి. అధికార యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది,” అని ఎస్పీ పేర్కొన్నారు.

అంతరం జడ్చర్ల టౌన్ లో నేషనల్ హైవే 167 పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, సిగ్నల్ గడ్డ దగ్గర జరుగుతున్న పనులను పరిశీలించి ట్రాఫిక్ జామ్‌ కారణము ఆరా తీశారు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్‌ను సరైన మార్గాలపై దారిమళ్లించేలా చర్యలు తీసుకోవాలని తగిన సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో  జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ జానకి.

పోలీసులు ప్రజలతో స్నేహాభావంతో మెలగాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. బుధవారం రాజాపూర్ పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలీసులు ప్రజలతో స్నేహాభావంతో మేలుగుతూ శాంతిభద్రతల పర్యవేక్షణ చేయాలనిపోలీసులకు సూచించారు.ప్రజలకు శాంతిభద్రతలపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శివానంద్ గౌడ్, పొలీస్ సిబ్బంది పాల్గొన్నారు.