23-07-2025 10:15:15 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన(State Higher Education Commissioner Devasena) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం వద్ద దేవస్థానం అధికారులు ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా ప్రధాన దేవాలయంలో భద్రాద్రి సీత, రామయ్యకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి దేవాలయం ఆవరణలో వేద పండితులు వేద ఆశీర్వచనం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.