calender_icon.png 24 July, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బాలో స్పాట్ అడ్మిషన్లు.!

23-07-2025 10:17:44 PM

పెంట్లవెల్లి కేజీబీవీ ఎస్ఓ. సువర్ణ..

పెంట్లవెల్లి: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్లు స్వీకరిస్తున్నామని స్పెషల్ ఆఫీసర్ సువర్ణ(Special Officer Suvarna) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంలోని మొదటి సంవత్సరానికి 15 సీట్లు ఖాళీగా ఉన్నాయని అందుకు పదవ తరగతి పూర్తి చేసిన అర్హులైన బాలిక విద్యార్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. విద్యార్థినిలు మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డ్, ఫోటో, సర్టిఫికెట్లతో అలాగే మరిన్ని వివరాలకు పెంట్లవెల్లి మండల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.