23-07-2025 12:44:36 AM
- స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
- ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, జూలై ౨2 (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సంసిద్ధం కావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. మంగళవారం భోరాజ్ మండలలో నిర్వహించిన పార్టీ వర్క్ షాప్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పెండల్ వాడ కు చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ పార్టీలో చేరగా.. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రె స్ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంద ని, గత పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. గ్రామాల లో బీజేపీకి మంచి ఆదరణ లభిస్తోందని, ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి నుంచి పని చేయాలని సూచించారు.
రాబోవు ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, మండల ఇంచార్జ్ దినేష్ మాటోలియా, విజయ్, అశోక్ రెడ్డి, సన్నీ, కరుణాకర్ రెడ్డి, రాందాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు