21-09-2025 10:31:59 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ ఉమ్మడి మండల రైతులు రుణమాఫీ కోసం రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని బస్ టర్మినల్ వద్ద అర్థనగ్న ప్రదర్శన ద్వారా నిరసన తెలియజేశారు. రుణమాఫీ కోసం రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. నిరసన ప్రదర్శనలో సాధన సమితి కన్వీనర్ కంట్లం గౌరీ శంకర్, రేసు లక్ష్మారెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, బొక్క రవీందర్ రెడ్డి, బొక్క సురేందర్ రెడ్డి, బొక్క కృష్ణారెడ్డి, కట్ట మధుసూదన్ రెడ్డి, బి రెడ్డి రవీందర్ రెడ్డి, సామల బాల్ రెడ్డి, ఎర్రోళ్ల మురళి, బొడిగె శ్రీనివాస్ గౌడ్, వేముల మహేశ్వర్ గౌడ్, కొమ్మిడి జైపాల్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.