21-09-2025 10:23:01 PM
మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి
చిన్న క్రాంతి కాలనీలో సీసీ కెమెరాల ప్రారంభం
మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒకటో డివిజన్ చిన్న క్రాంతి కాలనీలో సీసీ కెమెరాల దాత రాధిక నరసింహ సహకారంతో సీసీ కెమెరాల ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేడిపల్లి సీఐ మాట్లాడుతూ నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. కీలకమైన కేసుల చేధనలో సీసీ కెమెరాల పాత్ర గణనీయంగా ఉందన్నారు. ఇటీవల కాలంలో సీసీ కెమెరాల వినియోగం భారీగా పెరిగిందన్నారు. సీసీ కెమెరాలు అన్ని కాలనీలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల దాత గొరిగా రాధిక నర్సింహ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఉదయ భాస్కర్ రెడ్డి,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, మాజీ కార్పొరేటర్ చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, చిన్న క్రాంతి కాలనీ అధ్యక్షుడు బాపిరాజు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.