21-09-2025 10:36:29 PM
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా మొదలైంది, పూల పండుగగా పిలువబడే ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులు పాటు ప్రజలను అలంకరించనున్నాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మహిళలు సంబరాలను ప్రారంభించారు. తంగేడు గుణగు బంతి వంటి పూలను జాగ్రత్తగా పేర్చి అందమైన బతుకమ్మలను తయారు చేశారు సాయంత్రం వేళ మరిపెడ మున్సిపాలిటీ లో రామాలయం నందు బతుకమ్మలను ఒకే చోట చేర్చి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పడుతూ, నృత్యాలు చేశారు. ఈ పండుగ ఆడపడుచులకు ఆనందాన్ని ఉత్సాహాన్ని పంచిపెట్టింది. నవరాత్రుల చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.