21-09-2025 10:38:21 PM
అనంతగిరి: శ్రీ అయ్యప్ప సన్నిదిన అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో అమావాస్య సందర్బంగా మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో సమస్త ప్రజల అప మృత్యు భయ దోశాలు తొలగి, ఆరోగ్యముగా జీవించాలని హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాతలు హనుమకొండ వాస్తవ్యులు కూనబోయిన రాజ మహేందర్-మంగతాయారమ్మ దంపతులు వ్యవహరించారు. ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు, కొండపల్లి కిషన్ రావు,కొమరగిరి సాయి ప్రమోద్,గాదం శ్రీను, గరిడేపల్లి ఉపేందర్, యాగ్నిక స్వామి తీర్థం వేంకటేష్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.