21-09-2025 10:25:11 PM
నాగారం: నాగారం మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లె గ్రామానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్(MLA Mandula Samuel) సహాయ సహకారంతో విద్యుత్ దీపాలను మంజూరు చేశారు. ఆయన ఆదేశాల మేరకు గ్రామానికి మంజూరైన ఐమాక్స్ విద్యుత్ దీపాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పసుపులేటి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వడ్డే యాదగిరి, యూత్ కాంగ్రెస్ మండల జనరల్ సెక్రటరీ నాతి శ్రీను, యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు శిల రవీందర్, శిల మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి, మహేష్, వీరయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.