21-09-2025 10:41:28 PM
అనంతగిరి: దసరా పండగను పురస్కరించుకుని త్రైత సిద్ధాంతం, ప్రబోధ సేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక కోదాడ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో త్రైత సిద్ధాంత భగవద్గీత, అనుబంధ ఆధ్యాత్మిక గ్రంధాలను మండలంలోని త్రిపురవరం గ్రామంలో ఆదివారం త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథముల పరిచయ, ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దశ అంటే పది అని, 'ర' అంటే నశింప జేయడం అని అర్థం ఐదు కర్మేంద్రియాలను, ఐదు జ్ఞానేంద్రియాలను యోగ మార్గంలో నశింప జేయడం అంటే మొత్తం పది ఇంద్రియాలను జయించడమే దసరా పండుగ యొక్క అర్థం అని, అందరూ తెలుసుకోవాలని అని తెలిపారు. కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక కోదాడ కమిటీ అధ్యక్షుడు, సభ్యులు పోటు వేంకటేశ్వర్లు మేడ వెంకట నరసింహారావు, వంగాల మహేష్, చల్లా నరసింహారావు, ముత్తవరపు శైలజ, జాస్తి శివరామకృష్ణలు పాల్గొన్నారు.