calender_icon.png 23 September, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ తగ్గింపు దేశానికి మోదీ చారిత్రాత్మక దీపావళి కానుక

23-09-2025 01:43:58 AM

రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

ముషీరాబాద్, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): జీఎస్టీ తగ్గింపు మన దేశానికి ప్రధా ని నరేంద్ర మోదీ అందజేసిన చారిత్రాత్మక దీపావళి కానుకని బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు,  రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. తగ్గిన జిఎస్టి పన్ను భారాన్ని ప్రజలు వ్యాపారస్తులు దుకాణం యాజమానులు స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు. జీఎస్టీ తగ్గింపు నువ్వు హర్షిస్తూ సోమవారం చిక్కడపల్లి నుండి అశోక్ నగర్ కల్చర్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ వరకు వివిధ వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులను కలుస్తూ పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ జీఎస్టీని పలు వ్యాపార సంస్థలు స్వాగతిస్తున్నాయన్నారు. వైద్యానికి సంబంధించిన మందులు వైద్య పరికరాలు ఆరోగ్య భీమాలపై పూర్తిగా జిఎస్టి ఎత్తివేయడంతో పాటు ఇతర వాటిపై 18 శాతం నుండి ఐదు శాతానికి పన్ను మినహాయింపు నిర్ణయం ఎంతో అభినందనీయం అన్నారు. ప్రతి వ్యాపార స్థలాల్లో జీఎస్టీ తగ్గింపు వివరాలతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ చారిత్రక నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి. భరత్ గౌడ్, సికింద్రాబాద్ పార్ల మెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కు మార్, ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, అసెంబ్లీ కన్వీనర్ రమే ష్ రామ్, కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్, రచన శ్రీ, రవి చారి, వివిధ డివిజన్ల అధ్యక్షులు,  కార్యదర్శులు పాల్గొన్నారు.