calender_icon.png 1 November, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత రైతులకు అండగా ప్రభుత్వం

31-10-2025 12:00:00 AM

  1. ఎమ్మెల్యే కసిరెడ్డి 
  2. మొంథా తుపాన్‌కు దెబ్బతిన్న పంటలను పరిశీలన
  3. వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఆమనగల్లు, అక్టోబర్30( విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గం మొంథా తఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. కల్వకుర్తి  నియోజకవర్గంలోని వెల్దండ, తలకొండపల్లి  మండలాల్లో ఆయన పర్యటించారు. దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గాలం  శ్రమించిన రైతులు పంటలను అమ్ముకునే సమయంలో అకాల వర్షం రైతులను నిండా ముంచిందని  ఆయన పేర్కొన్నారు.

బాధిత రైతులు అధైర్య పడోద్దని.... పంట నష్టం వివరాలను  వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారని  నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీనిచ్చారు. అనంతరం తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి డైరెక్టర్ యాదమ్మ మార్కెట్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకుర్ ప్రభాకర్ రెడ్డి పీసీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ గూడూరు శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచులు కడమోని శ్రీశైలం రమేష్ యాదవ్ జైపాల్ రెడ్డి వ్యవసాయ అధికారి రేణుక పిఎసిఎస్ సీఈవో ప్రతాప్ రెడ్డి గ్రామస్తులు జగ్గారెడ్డి గౌస్ పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు