calender_icon.png 3 October, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు బోల్తా పలువురికి గాయాలు...

03-10-2025 06:38:26 PM

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే...

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం పోలీసు స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై కారు బోల్తాపడింది. ఈ ఘటన లో కారులో ఉన్న ఓ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఐతే అటుగా వస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రమాదాన్ని గమనించి,  తన వాహనాన్ని ఆపి, తక్షణమే అంబులెన్స్ కు కాల్ చేసి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని కార్యకర్తలతో కలిసి రోడ్డుపై ఉన్న కారును పక్కకు జరిపించారు.