07-09-2025 01:01:32 AM
మల్కాజిగిరి, సెప్టెంబర్ 6(విజయక్రాంతి) : వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్బంగా గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని దయానంద్ నగర్, గౌతం నగర్, మల్లికార్జున నగర్, గోపాల్ నగర్, జ్యోతి నగర్, మిర్జాలగూడ, ఇందిరా నెహ్రూ నగర్, రామాంజనేయ నగర్ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో ఉత్సాహంగా వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతా రాము యాదవులు మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.