calender_icon.png 5 May, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి..

05-05-2025 04:40:14 PM

ప్రజా సంఘాల నాయకులు మాదాసి సురేష్, తెలంగాణ కొమురయ్య..

హనుమకొండ (విజయక్రాంతి): మావోయిస్టులపై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొమురయ్యలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీసీ రాజ్యాధికార సమితి నాయకుడు మిరియాల కుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూర్ తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అమాయకపు గిరిజనులను చంపుతున్నారని ఆరోపించారు.

మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదని మాట్లాడుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయని ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారని కర్రెగుట్టల నుండి పోలీసు బలగాలను వెనక్కి రప్పించి శాంతి చర్చలు జరపాలని ఆదివాసీ ప్రాణాల హననాన్ని కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మిర్యాల కుమార్, పులిచేరు పైడి, అమ్ముల అశోక్ యాదవ్, చెన్నబోయిన పవన్ యాదవ్, గడ్డం స్వామి, గుండెబోయిన మొగిలి, వెల్ధండి భాస్కర్ తదితరులు పాల్గోన్నారు.