calender_icon.png 3 January, 2026 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను మోసగిస్తున్న ప్రభుత్వాలు

03-01-2026 12:00:00 AM

  1. తప్పించుకు తిరుగుతున్నఎంపీ, ఎమ్మెల్యేలు
  2. మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజం
  3. సోయా కొనుగోలు చేయాలంటూ రైతుల పక్షాన జాతీయ రహదారిపై బైఠాయించిన బీఆర్‌ఎస్ శ్రేణులు

ఆదిలాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): జిల్లాలో రైతులు తమ పంటను అమ్ముకునేందుకు పడుతున్న ఇబ్బందులను గ్రహిం చిన బీఆర్‌ఎస్ అన్నదాతల పక్షాన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. సోయాబీన్ కొనుగో లు చేయాలని డిమాండ్‌తో దశలవారి ఆం దోళనలో భాగంగా తొలిరోజు శుక్రవారం జైనథ్, బేల మండలాల జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రైతులకు అండ గా జాతీయ రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీం తో ట్రాఫిక్ స్తంభించింది.

దీంతో ఆర్డీవో స్రవంతి, డిఎస్పి జీవన్ రెడ్డి లు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదా యించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రామన్న మాట్లాడుతూ... సోయా కొనుగోళ్లలో కేంద్రంపై రాష్ట్రం రాష్ట్రంపై కేం ద్రం ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుం టూ రైతులను మోసగిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మండిపడ్డారు. రైతులకు న్యా యం చేయలేక బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. సోయా రంగు మారితే కొనుగోలు నిలిపివేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కేంద్ర, రాష్టా ప్రభుత్వలు రైతులకు న్యాయం చేయలేక రంగులు మారుస్తూ, తీర్కో మాట మార్చుతూన్నారన్నారు. తక్షణమే రైతులు పం డించిన పంటలను కొనుగోలు చేసి, న్యా యం చెయ్యాలని డిమాండ్ చేశారు. శనివారం ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడిని చేస్తామని వెల్లడించారు.

రైతులకు అన్యా యం జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం పదవులను అనుభవిస్తే అర్థం లేదని, రైతుల పక్షాన వారి పదవులకు రాజీనామా చేసేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ నిరసనలో నాయకులు రౌతు మనోహర్, యాసం నర్సింగరావు, మార్చెట్టి గోవర్ధన్, మెట్టు ప్రహ్లాద్, లింగారెడ్డి, సతీష్ పవార్, గణేష్ యాదవ్, ప్రమోద్ రెడ్డి, పలువురు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.