17-12-2024 02:17:35 AM
మంత్రి తుమ్మల
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): తమ ప్రభుత్వం రైతు సంక్షేమం తో పాటు చేనేత రంగానికి పెద్దపీట వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యుడు ఎల్ రమణ అడిగిన ప్రశ్న కు మంత్రి జవాబిస్తూ.. ఆత్మహత్య చేసుకున్న నేతలన్నల కుటుం బాలకు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారు. ఇటీవల 13 మంది కార్మికుల విషయంలో ప్రభుత్వం విచా రణ చేయ గా వారివి కుటుంబ కలహాలతో జరిగిన ఆత్మహత్యలని, వృతిపరమైనవి కావని తేలడంతో ఆర్థికసాయం ఇవ్వలేదన్నారు. చేనేతలకు బీమా, పెన్షన్లు, ఇతర సౌక ర్యాలు అందిస్తామని.. ఇందులో ఎలాంటి అను మానం అవసరం లేదన్నారు.