26-12-2025 06:06:15 PM
ముకరంపురా,(విజయక్రాంతి): ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నగరంలోని సుడా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... వేం నరేందర్ రెడ్డి ప్రజా జీవితంలో సౌమ్యుడిగా అందరికి అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని వారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య,అసంపల్లి వాసు, శభానా మహమ్మద్,శ్రీధర్ రెడ్డి,తోట అంజయ్య,ముల్కల కవిత,అట్టెపు వేణు,అష్రఫ్,మహమ్మద్ భారీ,బషీర్, మసూద్,మాసూమ్ ఖాన్, జిలకర రమేష్ తదితరులు పాల్గొన్నారు.