calender_icon.png 13 July, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెటర్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

09-08-2024 09:19:45 PM

హైదరాబాద్: భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల టీ20 ప్రపంచకప్ సాధించిన తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న సిరాజ్ జుబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలో మర్యాదపూర్వంగా కలిశారు. సీఎంకి టీమిండియా జెర్సీని బహుకరించారు. ఈ సందర్భంగా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు జూబ్లీహిల్స్ లో 600 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మహ్మద్ సిరాజ్ కు ఇంటిపత్రాలను అందచేసింది.