calender_icon.png 13 July, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూలో పదోన్నతులు కల్పించండి

09-08-2024 09:38:09 PM

సీసీఎల్‌ఏ కమిషనర్‌కు టీజీటీఏ ప్రతినిధుల వినతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో అర్హతలు కలిగినజూనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ వరకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ శక్రవారం టీజీటీఏ ప్రతినిధులు సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్‌కు వినతి పత్రం అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో అర్హతలున్నా పదోన్నతులు కల్పించని కారణంగా ఉద్యోగులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఇప్పటికైనా జూనియర్ అసిస్టెంట్ సినయర్ అసిస్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్‌ను డిప్యూటీ తహసీల్దార్‌గా, డిప్యూటీ తహసీల్దార్లను తహసీల్దార్లుగా, తహసీల్దార్లను డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని సీసీఎల్‌ఏ కమిషనర్‌ను కోరగా, ఆయన తమ వినతిపై సానుకూలంగా స్పందించారని టీజీటీఏ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీటీఏ అధ్యక్షులు ఎస్.రాములు, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ తదితరులు ఉన్నారు.