10-11-2025 08:50:29 PM
ప్రారంభమైన స్కౌట్స్, గైడ్స్ శిక్షణ తరగతులు..
మునిపల్లి: మండల పరిధిలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో జరుగుతున్న స్కౌట్స్, గైడ్స్ శిక్షణ తరగతులు సోమవారం నాడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కౌట్స్ , గైడ్స్ తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మోహన్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో యువతకు క్రమశిక్షణ, సామాజిక సేవ, వ్యక్తిత్వ వికాసం కోసం ఉద్దేశించి స్కౌటింగ్ 1909లో, గైడింగ్ 1911లో ఇండియాలో స్థాపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల సొసైటీ పాఠశాల, కళాశాల ఎంపిక చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం ఈ 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రమ శిక్షణతో కలిసి మెలసి ఉన్నప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. ఈ శిక్షణలో సంగారెడ్డి జిల్లా లోని 45 ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్, కెజిబివి పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయులు, పీఈటీలు. పీఈటీలు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ ఆదేశాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడర్ ట్రైనింగ్ గైడ్ భరతమాత, హిమాలయ హుడ్ బ్యాడ్జి సాల్మన్, అసిస్టెంట్ లీడర్ రవి కిరణ్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి మాధవరెడ్డి, ఎంఈఓ భీమ్ సింగ్, లింగంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సురభి చైతన్య, ఉపాధ్యాయులు ఆంజనేయులు, సుందర్ రావు, చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యాయులు, జిల్లాలోని పిఈటిలు, పీడీలు తదితరులు పాల్గొన్నారు.