19-05-2025 10:38:33 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులందరికీ సరిపడ గన్ని సంచులు ఇచ్చి, త్వరగా కాంటాలు పెట్టించి, ధాన్యాన్ని మిల్లులు గోదాములకు తరలించి రైతులను వర్షాల నుంచి, వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడాలని సిపిఎం ఆధ్వర్యంలో తహసిల్దార్ వివేక్(Tahsildar Vivek)కు వినతిపత్రం అందించారు. అలాగే ధాన్యం అమ్మిన డబ్బులు, బోనస్ డబ్బులను రైతులకు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న, బొబ్బాల యాకుబ్ రెడ్డి, చాగంటి కిషన్, మోడెం వెంకటేశ్వర్లు, జల్లే జయరాజ్, నీరుటి జలంధర్, సోమారపు ఎల్లయ్య, ముద్ర కోల సారయ్య, గూగులోతు కేశ్య పాల్గొన్నారు.