calender_icon.png 15 October, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

15-10-2025 01:27:12 AM

సూర్యాపేట ఏఎంసీ చైర్మన్ వేణారెడ్డి

సూర్యాపేట, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మండలంలోని కాసరబాద్ గ్రామంలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐకెపి ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. తేమయంత్రాలు, ప్యాడి క్లీనర్లు, కాంటాలు, టార్పాలిన్లు, గన్ని బ్యాగులు కొరత లేకుండా చూడాలని సెంటర్ నిర్వాహకులకు ఆదేశించారు. గ్రేడ్-ఏ ధాన్యానికి రూ. 2389, సాధారణ రకం ధాన్యానికి రూ.2369 మద్దతు ధర పొందాలన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి,ఏపీఎం మైసయ్య,సీసీ యాదగిరి, విజయభాను, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ పొలాగని సైదులు, సంకరమద్ది వెంకట్ రెడ్డి, సరిత, వసంత,యల్లమ్మ, షార్ధ, నాగమ్మ,పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ళ రమేష్, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్, పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.