02-05-2025 12:23:30 AM
నాగర్ కర్నూల్ మే 1 (విజయక్రాంతి) అనుమానాధాస్పద స్థితిలో యువకుడు మృ తి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల పరిధిలోని సిర్సవాడ గ్రామంలో గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..... సిర్సవాడ గ్రామానికి చెందిన మంగలి రమేష్(30) అదే గ్రామం లో కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాడు.
గురువారం ఉదయం నిద్రిస్తున్న రమేష్ ను నిద్ర లేపడానికి వెళ్ళిన నాయనమ్మకు తన ఇంటి కిటికీ చున్నీతో ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతి చెందిన రమేష్ ఒంటిపై రక్తపు మరకలు, గాయాలు ఉండడంతో గ్రామస్తులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరేసుకున్న వ్యక్తి ఒంటిపై గాయాలు, రక్తం మరకలు ఎందుకుంటాయని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ ఏరి యా ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ప్రేమ విఫలమైన అంశమై ఉంటుం దని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.