calender_icon.png 8 October, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ విద్యా సదస్సులో పాల్గొన్న తపస్ నాయకులు

08-10-2025 12:34:41 AM

చేగుంట, అక్టోబర్ 7:అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షణిక్ మహా సంఘ్ (తపస్) ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో అక్టోబర్ 5 నుండి 7 వరకు జామ్ డోలి లోని కేశవ విద్యా పీఠంలో జరిగిన జాతీయ విద్యా సదస్సుకు మెదక్ జిల్లా నుండి తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటస్వామి, తిరునగిరి నర్సింలు, రాజేశ్వర్, మెదక్ డివిజన్ ఇంచార్జ్ మార్గం రాజు, మల్లేశం, మధుమోహన్, సిద్ధూ, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో జాతీయ నూతన విద్యా విధానం, సిపిఎస్ రద్దు, ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటు హక్కు, టెట్ మినహాయింపు, జిఓ 317, విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు, విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు.