29-11-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల అర్బన్, నవంబర్ 28 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు పార దర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ ఆద్వర్యంలో ఆర్వోలకు, ఏఆర్వోలకు ఫేజ్ -2 శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు. ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని వీడియో ప వర్ ప్రెజెంటేషన్ ద్వారా అవగహన కల్పి స్తూ ఎన్నికల విధుల పై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలంటే నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన అం శమని, దీని పైన చాలా కేసులు దాఖలు అ య్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశం ని బంధనల ప్రకారం జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. అధికారిక రిజర్వేషన్ అంశా లను మాత్రమే పరిశీలించాల ని అన్నారు.
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల్లో పోటీచేయు అభ్యర్థులకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రాలు, ప్రచార వాహనాల అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత మండల తహసిల్దార్లను సంప్రదించాలని తెలిపారు.
గ్రామాలలో ఎక్కడైనా సర్పంచ్ అభ్యర్థికి 8, వార్డు సభ్యులకు 6 కంటే ఎక్కువ నామినేషన్ దాఖలైతే తమకు తెలియజేయాలని అన్నారు. అభ్యర్థుల అన్ని వివరాలు నామినేషన్ పత్రాలలో పూర్తిగా నమోదు చేయాలని, లేనిచో ఆ నామినేషన్ ను తిరస్కరించాలని సూచించారు. ప్రతి చిన్న అంశాన్ని, అనుమానాలను శిక్షణ లో పూర్తి స్థాయిలోనివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఎన్నికల ప్రవర్తన నియ మవాళికి లోబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగ డ్బందీగా ఎన్నికలు నిర్వహించుటకు అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ కు ఒకరోజు ముందుగా కొత్త బ్యాంక్ ఖాతా తీసుకునే విధంగా వారికి తెలియజేయాలని సూచించారు.
ఎన్నికలకు సంబంధించిన నామినే షన్ ఒరిజినల్ పత్రాలను సంబంధిత గ్రామ పంచాయతీలలోని ఆర్వో ల వద్ద పొందవచ్చని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసుధన్, జిల్లా వ్యయ పరిశీలకులు జనరల్ అబ్జర్వర్ జి. రమేష్, ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ ఏం. మనోహర్, మదన్ మోహన్, రేవంత్, జిల్లా నోడల్ అధికారులు, జిల్లా ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.