calender_icon.png 6 August, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతినెలా వేతనాలు చెల్లించాలి

06-08-2025 12:00:00 AM

ములకలపల్లి, ఆగస్టు 5, ( విజయ క్రాంతి): గ్రామ పంచాయతీలల్లో పనిచేస్తున్న కార్మికుల కు ప్రతి నెల పెండింగ్ లేకుండా వేతనాలు చెల్లించాలని సిపిఎం అనుబంధ సిఐటియు జిల్లా ప్ర ధాన కార్యదర్శి ఏజే రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన ఆ సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందిన మండలంలోని వికే రామవరం పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ భద్రయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థి కంగా ఆదుకోవాలని కోరారు.కార్మికుడు భద్రయ్య కి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ను వెం టనే చెల్లించాలని డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతి నెల వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కార్మికులందరికీ రక్షణ కిట్లు పంపిణీ చేయాలని కార్మికుల పట్ల పై అధికారుల ఒత్తిడి చేస్తే సహించబోమని హెచ్చరించారు.గ్రామ పంచాయతీ కార్మి కులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 51 ని తక్షణమే రద్దు చేసి గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభు త్వం గ్రామ పంచాయతీ కార్మికుల అదనపు పనులు చేయించరాదని ఒక వేళ అదనపు పనికి అ దనపు వేతనం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.మల్టీ పర్పస్ వర్కర్లలకు ప్రమాద బీమా సౌకర్యం ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేశారు.

పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్లకు లైసెన్సులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ములకలపల్లి లో జిల్లా మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు, తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మం డల అధ్యక్ష,కార్యదర్శులు చిక్కుల శ్రీను, గంటా శ్రీనివాసరావు,వర్క రుక్మధరావు,వగ్గేల దారయ్య,వెలకం రాఘవులు,మేకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.