06-08-2025 12:00:00 AM
ఘట్ కేసర్, ఆగస్టు 5 : పోచారం మున్సిపల్ చౌదరిగూడ రేణుక-ఎల్లమ్మ కాలనీలో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణంకు మాజీ ఎంపీపీ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాలనీలో రోడ్డు కబ్జా చేశారని దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని స్థానిక బిజెపి నాయకులు ఇచ్చిన సమాచారంతో మంగళవారం మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కాలనీ ప్రజలతో కలిసి సమస్య ఉన్న రోడ్డు వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకోవడం జరిగింది.
అనంతరం ఆస్థలానికి సంబంధించిన యజమానితో సమస్య పరిష్కరించే విధంగా మాట్లాడి అదే స్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని కాలనీ ప్రజలకు సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. యజమాని సత్యనారాయణతో కలిసి భూమి పూజలో భాగంగా కొబ్బరికాయ కొట్టి శంఖుస్థాపన చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు కొత్త బాలుయాదవ్, జగదీష్ గౌడ్, వెంకట్, కాలనీ అధ్యక్షురాలు మంగ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.