25-08-2025 12:52:01 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): బడుగ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నా రు. శ్రావణమాసం పురస్కరించుకొని నెలరోజుల పాటు మద్యం, మాంసానికి దూరంగా ఉన్నారు. శ్రావణమాసం పొలాల అమావా స్య మరుసటి రోజు బడుగ పండుగను ఆదివాసి సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక వంట కాలు చేసి వనదేవతకు నైవేద్యాలు సమర్పించి వేడుకలు జరుపుకున్నారు. బడుక సందర్భంగా మాంసాహార దుకాణాలు, వైన్స్ కిక్కిరిసిపోయాయి.