calender_icon.png 25 October, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ

25-10-2025 12:26:56 AM

మానకొండూరు, అక్టోబర్ 24, (విజయక్రాంతి)కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వన్నారం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతి కార్యాలయ భవన నిర్మాణ సముదాయానికి శుక్రవారం గ్రామస్తులు ఘనంగా భూమి పూజ నిర్వహించారు.

గ్రామ పంచాయతి స్పెషల్ ఆఫీసర్, మండల పరిషత్ ఏఈ కొమురోజు వెంకన్న, గ్రామ పంచాయతి సెక్రటరీ  తంబ ప్రసూన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ పోలాడి రామారావు, మాజీ సర్పంచులు బాకారపు శ్రీనివాస్, మద్దెల లచ్ఛయ్య , పోలాడి కవితా వంశీధర్ రావు, మాజీ ఉపసర్పంచ్ బాకారపు తిరుపతి, గ్రామ పంచాయతి ఆఫీసర్ కర్ర నర్సయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బాకారపు రమేష్, తాళ్లపల్లి కొమురయ్య, తాళ్ళ పల్లి తిరుపతి, జినుక అనిల్, నాయకులు పోలాడి యాదగిరి రావు,పోలాడి జగన్మోహన్ రావు, తాళ్ళ పల్లి సంపత్, పోలాడి ప్రభాకర్ రావు, భాకారపు రాములు, ఆకునూరి లక్ష్మయ్య , గ్రామ పంచాయతి ఉద్యోగులు గ్రామస్తులుపాల్గొన్నారు.