25-10-2025 12:26:18 AM
వలిగొండ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని నాగారం గ్రామ పరిధిలో గల సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పండించిన పత్తిని మధ్య దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో శేఖర్ రెడ్డి, తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.