02-08-2025 10:49:06 PM
పోద్దంత వ్యాపారం, రాత్రంతా దొంగతనం ఈ ముఠా పని
చాకచక్యంగా పట్టుకుని చోరీ చేసిన సొత్తు స్వాధీనం
ఐదు ప్రత్యేక బృందాలు గాలింపుతో చిక్కిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా
ఎస్పి రాజేష్ చంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): పొద్దంతా ఐస్ క్రీమ్లులు అమ్మడం... రాత్రంతా దొంగతనాలు చేయడం ఈ అంతర్ రాష్ట్ర ముఠా పని. కామారెడ్డి జిల్లాలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ ముఠా కోసం ఐదు పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలించగా ఐదుగురు కలిసి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు శనివారం చిక్కినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. ఒకరు కామారెడ్డి ఆదర్శనగర్ లో ముగ్గురు ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటూ పొద్దంతా ఐస్ క్రీములు తయారు చేస్తూ అమ్మడం పనిచేస్తూ రెక్కి నిర్వహించి రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడడం ఈ ముఠా పని అని ఎస్పీ వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా బిక్కనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఇటీవల రెడి మ్యాక్స్ వద్ద కాపాలా ఉన్న ఇద్దరి నీ చితకబాది వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ లను, ఇనుమును చోరీకి పాల్పడ్డ డంతో భిక్కనూర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇదే మండలంలోని తల మడ్ల వద్ద 15 లక్షల విలువ గల ఇనుప రాడులను చోరీ చేసి హైదరాబాద్ ముషీరాబాద్ లో అమ్మినట్లు విచారణలో తేలినట్లు ఎస్పి చెప్పారు. దొంగల నుంచి కొనుగోలు చేసిన ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో ఒకరు మైనర్ ఉన్నట్లు తెలిపారు.
వీరి వద్ద నుంచి సెల్ ఫోన్లతో పాటు ఇనుప సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి నేతృత్వంలో ఐదు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో భిక్కనూరు సిఐ సంపత్ కుమార్, దేవునిపల్లి రూరల్ సి ఐ రామన్, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు, పోలీస్ సిబ్బందిని ఎస్ పి రాజేష్ చంద్ర అభినందించారు.