02-08-2025 10:36:52 PM
6 మంది మండల పంచాయతీ అధికారులకు షోకాజ్ నోటీసులు
యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో 9 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణ చేయడంలో నిర్లక్ష్యం వహించిన 6 మంది మండల పంచాయతీ అధికారులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. పంచాయతి కార్యదర్శులు నిత్యం డి యస్ ఆర్ యాప్ లో సెల్ఫి దిగి తమ హాజరును నమోదు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా అధికారులకు నకిలీ హాజరు నమోదు పంపుతూ మోసం చేయడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి సునంద తెలిపారు. ఈ రిపోర్టును కలెక్టర్ దృష్టి తీసుకురాగా పై విధంగా కలెక్టర్ వారిపై చర్యలు తీసుకున్నారు.
సస్పెండ్ అయినవారిలో ఆత్మకూరు మండల్ సింగారం గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఆనంద్, రామన్నపేట మండలం తుర్కపల్లి గ్రామపంచాయతీ సెక్రటరీ అబ్దుల్ ఖదీర్, చౌటుప్పల్ మండల్ నాగారం గ్రామపంచాయతీ సెక్రటరీ సతీష్ కుమార్, రామన్నపేట మండల్ పల్లివాడ గ్రామపంచాయతీ సెక్రటరీ ఎన్ వెంకటేష్, చౌటుప్పల్ మండల్ ఎల్లం బావి సెక్రెటరీ రామకృష్ణ, ధర్మోజి గూడెం పంచాయతీ సెక్రెటరీ మోత్కూర్ మండల్ దాచారం గ్రామపంచాయతీ సెక్రెటరీ యాదగిరి, గుండాల మండలం వస్తా కొండూరు పంచాయతీ సెక్రెటరీ ఇస్మాయిల్, గుండాల మండలం అంబాల పంచాయతీ సెక్రెటరీ సైదులు, సంస్థాన్ నారాయణపురం మండలం పాలగట్టు తండా సెక్రెటరీ పి గంగారాములు ఉన్నారు. షోకాజ్ నోటీసులు అందుకున్న అధికారులు పద్మావతి, రావు ఊపు, అంజిరెడ్డి, జనార్దన్ రెడ్డి, సలీం, నరసింహారావులు పేర్కొన్నారు.