02-08-2025 10:45:07 PM
నంగునూరు: నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.డి. గౌసోద్దీన్ 2వీలర్ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో తన విధుల నిర్వహణలో భాగంగా వైకుంఠధామం దగ్గరికి తన ఫ్యాషన్ బైక్ (AP 23 R 1196)పై వెళ్లారు. ఆ క్రమంలో తన 2 వీలర్ వాహనాన్ని పార్క్ చేసి,నర్సరీ పనుల కోసం లోపలికి వెళ్ళిన సమయంల గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనపై కార్యదర్శి కౌజుద్దీన్ రాజగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా , కేసు నమోదు చేశామని దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎస్సై వివేక్ తెలిపారు.