02-08-2025 10:52:09 PM
కామారెడ్డి జిల్లా కంచుమల్ వద్ద రోడ్డు దాటుతున్న చిరుత
భయాందోళనలో గ్రామస్తులు
కామారెడ్డి,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం తో స్థానికులను భయాందోళన గురిచేస్తున్నాయి. శనివారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కంచు మల్ గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న చిరుత సంచారం సీసీ కెమెరాలు నమోదయింది. రోడ్డు దాటుతున్న చిరుతను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అటవీ శాఖ పరిధిలోని కంచు మాల్ గ్రామం ఉందని స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించి బోను ఏర్పాటుచేసి స్థానికులను భయాందోళన నుంచి విముక్తులను చేయాలని కోరుతున్నారు. గత నెలలో పెద్దపులి సంచారం తో పాటు చిరుతపులుల సంచారం కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన విషయం విధితమే. శనివారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కంచుమల్ గ్రామం వద్ద చిరుత సంచారం తో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.