02-08-2025 10:31:45 PM
గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్
ఆదిలాబాద్,(విజయక్రాంతి): నీతి అయోగ్ ఎంపిక చేసిన 500 ఆస్పిరేషన్ బ్లాకులలో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల బ్లాక్ మొదటి స్థానంలో నిలిచి ఏకైక స్వర్ణ పతాకం ను గెలిచింది. ఈ మేరకు నీతి అయోగ్ ప్రతిపాదిత ఆస్పిరేషన్ బ్లాక్ నార్నూర్ ప్రోగ్రాం కింద శనివారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా అందుకున్నారు. ఆరోగ్య, పోషణ, వ్యవసాయం, విద్య, మౌలిక సదుపాయాలు తదితర ఆరు సూచికలలో మెరుగైన పనితీరును ప్రదర్శించినందుకే ఈ పురస్కారం లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.